లడ్డూ ఎఫెక్ట్ : జగన్ మరో నిర్ణయానికి చెక్ పెట్టిన టీటీడీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయ్యిందన్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం గతంలో టెండర్ల విషయంలో అనుసరించిన ఓ విధానాన్ని రాష్ట్రంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి అనుగుణంగా టీటీడీ కూడా అదే నిర్ణయం తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గత టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టిన పలు టెండర్లను రద్దు చేసింది. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. ఇందులో గతంలో ఇచ్చిన టెండర్లను సమీక్షించి అంతకంటే తక్కువ రేట్లకు అదే పనులు చేసే లేదా వస్తువులు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికే కొత్తగా టెండర్లు ఇచ్చేవారు. ఈ విధానం పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు కీలక ప్రాజెక్టుల్లోనూ సాగింది. అలాగే తిరుమల లడ్డూకు వాడే నెయ్యి విషయంలోనూ అనుసరించారు. ఇప్పుడు దీని వల్లే లడ్డూ కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఇకపై ఏ టెండర్లలోనూ ఈ విధానం అమలు చేయకూడదు. ఈ నేపథ్యంలో తిరుమలలోనూ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈవో శ్యామలరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల నెయ్యితో పాటు ఇతర కొనుగోళ్లలోనూ పాత టెండర్ల విధానమే అమలు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications