TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఇక ముందు కొండ మీద టిక్కెట్లు

శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో ప్రక్షాలన మొదలైయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలోని ఐదు సంవత్సరాల్లో తిరుమలలో భక్తుల సౌకర్యాల గురించి పట్టించుకోలేదని, అన్నప్రసాదాలు సక్రమంగా అందడంలేదని, క్యూకాంప్లెక్స్ లో మంచినీరుతో పాటు అన్నప్రసాదాలు సక్రమంగా అందివ్వడం లేదని, శ్రీవారి లడ్డూల రుచి తగ్గిపోయిందని, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని తిరుమల శ్రీవారి భక్తులు అనేక ఆరోపణలు చేశారు.

అలాగే తిరుమల శ్రీవారి భక్తుల దైవదర్శనంలో కూడా పలు విమర్శలు తలత్తెయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందేలా మొదట చర్యలు తీసుకున్నారు. అలాగే నాణ్యమైన తిరుమల లడ్డూలు భక్తులకు అందిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, శ్రీవారి భక్తులకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్యామలరావు ఇటీవల శ్రీవారి భక్తులకు మాట ఇచ్చారు. తిరుమలలో ఇప్పుడు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

TTD Additional EO CH Venkaiah Chowdhary inspects places to set up Srivani counter

తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈవో వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.

శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు తిరుమలలోని గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం ప్రక్కన వున్న టీటీడీ కల్యాణ మండపం ప్రాంతం, తిరుమల డీఎఫ్ఓ కార్యాలయాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను కూడా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఇదే సమయంలో టీటీడీ సీనియర్ అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ ఈవో శ్యామలరావుతో, ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+