TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు - ఆంక్షలు, పరిమితులు..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవకు ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ సేవ కోసం తిరుమల కు తరలి వస్తారు. దాదాపు మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల పైన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్కింగ్, ట్రాఫిక్ విషయంలో భక్తులకు కీలక సూచనలు చేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం గరుడ వాహన సేవ. రేపు (ఆదివారం) ఈ సేవ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల్లో గరుడవాహనంపై విహరిస్తారు. ఈ కీలక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 27న రాత్రి 9 గంటల నుండి 29న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేసారు. అలిపిరి పాత చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. పార్కింగ్ ప్రదేశాల కోసం QR కోడ్ ను ఉపయోగించుకోవాలని..పోలీస్ శాఖ, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.













Click it and Unblock the Notifications