శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - దర్శన,వసతి గదుల కోటా క్యాలెండర్ విడుదల..!!
Tirumala: తిరుమల భక్తులకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రతీ నెలా ఆన్ లైన్ లో దర్శన,వసతి గదులు కోటా విడుదలకు సంభంధించిన క్యాలండర్ ని టీటీడీ విడుదల చేసింది. ఏ తేదీన ఏ కోటా విడుదల చేసేదీ స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించి టీటీడీ ఈవో కీలక ప్రకటన చేసారు. అదే విధంగా అహ్మదాబాద్,రాయపూర్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. శ్రీవారి ఆనంద నిలయం వీడియో వ్యవహారంలో నిఘా వైఫల్యంగా ధర్మారెడ్డి పేర్కొన్నారు.
క్యాలెండర్ విడుదల : తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ దర్శన..వసతి కోటా క్యాలెండర్ ను విడుదల చేసింది. ప్రతి నెల 18వ తేది నుంచి 20 వ తేది వరకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయనుంది. అదే విధంగా 21వ తేదిన వర్చువల్ సేవా టిక్కేట్లుతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నారు. 23వ తేదిన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. 24వ తేదిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లు విడుదల చేస్తారు. 25వ తేదిన వసతి గదులు కోటా విడుదల చేసే విధంగా క్యాలెండర్ ను ఖరారు చేసారు. ఇక నుంచి ఈ తేదీల ప్రకారం కోటా విడుదల కానుంది.

నకిలీ పై చర్యలు : అలిపిరి నడకమార్గంలో వచ్చే భక్తులుకు తిరుపతిలోని భూదేవి కాంప్లేక్స్ వద్ద టోకేన్లు జారి చేస్తూన్నామని ఈవో దర్మారెడ్డి చెప్పారు. సర్వదర్శన భక్తులుకు తిరుపతిలోని శ్రీనివాసం,విష్ణు నివాసం, గోవింద రాజస్వామి సత్రాలు వద్ద టోకేన్లు జారి చేస్తున్నట్లు వివరించారు. నకిలీ వెబ్ సైట్లు 52 గుర్తించామని, 13 మొబైల్ యాప్ లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసామని చెప్పారు. రంపచోడవరంలో మే 17 నుంచి 22వ తేది వరకు మహసంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే అహ్మదాబాద్,రాయపూర్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. జమ్మూలో వచ్చే నెల 8న మహా సంప్రోక్షణ జరుగుతుందని చెప్పుకొచ్చారు.

నిఘా వైఫల్యమే : తాజాగా శ్రీవారి ఆలయంలోనూ మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఘటన పైన స్పందించిన ఈవో ధర్మారెడ్డి భక్తుడు ఉద్దేశ పూర్వకంగానే తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్దంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. భద్రతా సిబ్బంది వైఫల్యం కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. విచారణ తరువాత బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications