భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం - ఆన్ లైన్ సదుపాయం, నేరుగా ఇంటి వద్దకే..!!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సేవల్లో టీటీడీ కీలక మార్పులు తీసుకొ స్తోంది. దర్శనంతో పాటుగా వసతి విషయంలో పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. శ్రీవారి ఆలయం నవంబరు 16వ తేదీ పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ కారణంగా నవంబర్ 16వ తేదిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, 2027 క్యాలెండర్, డైరీలను ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తూ టీటీడీ వివరాలను వెల్లడించింది.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి టేబుల్-టాప్-క్యాలెండర్లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 విక్రయ కేంద్రాల్లోనూ ఈ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అదే విధంగా భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.

తిరుమలలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు
కాగా. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం కల్పించారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీ పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 15న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కారణంగా నవంబర్ 16వ తేదిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.













Click it and Unblock the Notifications
