TTD: నెల రోజులు సుప్రభాత సేవ రద్దు - వైకుంఠ ద్వార దర్శనం దక్కాలంటే..!!
Tirumala: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ ప్రక టించింది. అదే విధంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో, శ్రీవారి మేల్కొలుపు సేవ సుప్రభాతం ఆ మాసం మొత్తం రద్దు చేసి..ఆ స్థానం తిరుప్పావై పఠించాల ని నిర్ణయించారు. ఇక, రధ సప్తమి వేళ ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు.. సేవల రద్దు పైనా టీటీడీ అధికారులు స్పష్టత ఇచ్చారు.
సుప్రభాతం రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవకు ప్రత్యేకత ఉంది. ఈ సేవతోన స్వామి వారిని మేల్కొలిపి అలంకరణ.. అర్చన నిర్వహిస్తారు. ఆ తరువాతనే భక్తుల దర్శనాలు ప్రారంభం అవుతాయి. అయితే, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో, ధనుర్మాసం మొత్తం సుప్రభాత సేవను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది. సుప్రభాత సేవ స్థానం లో తిరుప్పావై పారాయణం చేస్తారు. ప్రతీ ఏటా తిరుమలలో ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. దీంతో, ఈ ఏడాది ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాత సేవ ఉండదని స్పష్టం చేసారు.

విశేష పర్వదినాలు
డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం అవుతుంది. 11న సర్వ ఏకాదశి నిర్వహిస్తారు. ఇక, 12న చక్రతీర్థ ముక్కోటి. 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర. 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. 26న సర్వ ఏకాదశి.ఇక, 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడి యాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కావటంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం
వచ్చే ఏడాది జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు పది రోజులపాటు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు.. ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications