TTD: తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి..!!

Tirumala: తిరుమలలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల కొండ పైన మహిళా భక్తులకు ఉచిత బస్సు రవాణా ఏర్పాటు చేయనుంది. అలిపిరిలో చెక్‌ పాయింట్‌ అభి వృద్ధి లో భాగంగా కొత్త విధానం అందుబాటులోకి తెస్తున్నారు. ఇక.. తిరుమలకు రాకపోకలు సాగిం చే కనుమ దారుల యందు ( ఘాట్ రోడ్డులలో) బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యం లో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

భక్తులకు సూచన
తిరుమలలో శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో, భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోంది. మరమ్మతుల కారణంగా వాహన దారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించగాలని సూచిస్తోంది. తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచన చేసింది.

ttd-appeals-to-all-vehicle-users-to-drive-cautiously-along-ghat-routes

తిరుమలలో ఉచిత బస్సు
తిరుమల లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం తిరుమలలో అన్ని ప్రాంతాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. ఈ మేరకు అమలు చేయడానికి ఆర్టీసీ ముందుకొచ్చిందని తెలిపారు. మహిళలు తిరుమలలో సులభంగా ప్రయాణించేందుకు, భక్తి యాత్ర మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉచిత బస్సు సర్వీసు తొలి దశలో 150 బస్సులను రంగంలోకి దించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల గిరులపై వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణంలో మహిళలకు భద్రత, సౌకర్యం కల్పించాలన్నదే ఈ పథక ప్రయోజనంగా చెప్పారు.అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను తరువాతి దశల్లో అందుబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తోంది.

అన్యమత ఉద్యోగులపై
అదే విధంగా టీటీడీలో పనిచేస్తున్న 21 మంది అన్యమత ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం ఎంపికను ఇచ్చినట్లు ఈవో తెలిపారు. వారు ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా తప్పుకోకపోతే, కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల దేవస్థానానికి హిందూ మతాన్ని అనుసరించే ఉద్యోగులే అవసరమన్న విధానంతో టీటీడీ ముందుకెళ్తోంది. ఇక, అలిపిరిలో చెక్‌ పాయింట్‌ అభివృద్ధిలో భాగంగా జీఎంఆర్‌ సంస్థకు చెందిన ఓ బృందం పరిశీ లన చేసిందన్నారు. ఆధునాతన కెమెరాలు, స్కానర్లు అందుబాటులోకి తీసుకువచ్చి తనిఖీల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తామన్నారు. భవిష్యత్తులో భక్తుకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని శ్యామలరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+