TTD: శ్రీవారి ఆలయం వద్ద బూతులతో రెచ్చిపోయిన బోర్డు సభ్యుడు..!!
Tirumala: కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోర్డు సభ్యుడు బూతులతో రెచ్చి పోయారు. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమలలో పాలక మండలి సభ్యుడే.. అక్కడ పని చేసే ఉద్యోగి పై బూతులతో విరుచుకు పడటం వైరల్ అవుతోంది. భక్తుల సమక్షంలోనే.. పవిత్ర మైన ఆలయ మహాద్వారం వద్ద పాలక మండలి సభ్యుడే ఈ రకంగా వ్యవహరించటం పైన శ్రీవారి భక్తులు మండి పడుతున్నారు. పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన బోర్డు సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
బోర్డు సభ్యుడి తీరుతో
తిరుమలలో టీటీడీ పాలక మండలి సభ్యుడు ప్రవర్తన పైన భక్తులు మండిపడుతున్నారు. ఆలయ మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ బయటకు పంపటం లేదని సమాధానం ఇచ్చినందుకు ఉద్యోగి పై పరుష పదజాలంతో ఆలయం ఎదుటే దూషించారు. బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్ద కు చేరుకున్నారు. బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని కోరారు. మహా ద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదిం చాలని ఉద్యోగి సమాధానమిచ్చారు.

ఉద్యోగి పై మండిపాటు
దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిపై అసభ్య దూషణకు దిగటంతో భక్తులు విస్తుపోయారు. ఉద్యోగిని ఉద్దేశించి బోర్డు సభ్యుడు..నరేశ్ కుమార్ "నిన్ను ఇక్కడ పెట్టిందె వరు, ఏమనుకుంటు న్నావు.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా" అంటూ...ఉద్యోగి పై బూతులతో రెచ్చిపోయారు. దీంతో, పవిత్రమైన శ్రీవారి ఆలయంలో బోర్డు సభ్యుడు భక్తిశ్రద్ధలతో ఉండకుండా బూతులు మాట్లాడటం ఏంటి అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగు లు, సిబ్బంది, భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే సంయమనం కోల్పోయి వీధిరౌడీలా దూష ణలకు దిగి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల ఆగ్రహం
సమస్య ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బోర్డు సభ్యుడిగా ఉంటూ ఇలా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులపై పెత్తనం ప్రదర్శించడం ఏంటని భక్తులు మండిపడుతు న్నారు. ఈ సమయంలోనే మహద్వారం వద్దకు చేరుకున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపా రు. కొందరు ఉద్యోగులు కనీసం తమ స్థాయికి కూడా గౌరవం ఇవ్వట్లేదని, దురుసుగా ప్రవర్తిస్తు రని నరేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా, ఆలయ మహాద్వారం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications