Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: రమణ దీక్షితులపై వేటు, ఉద్యోగులకు వరాలు - బోర్డు కీలక నిర్ణయాలు..!!

Tirumala: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

పాలక మండలి సమావేశం: టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తుల సౌకర్యాల పెంపు పైన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

TTD Board serious action against Ramana Deekshitulu, Hikes Contract Employees Salaries

శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడానికి పాలక మండలి ఆమోదముద్ర వేసింది. రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీకి నిర్ణయించిన పాలక మండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

కీలక నిర్ణయాలు: ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అటవీ కార్మికుల జీతాలు పెంపు..వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపుకు ఆముద ముద్ర వేసారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటుకు నిర్ణయించారు.

అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం పై పాలక మండలి నిర్ణయించింది. రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు శేఖర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసారు. 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునికరణకు నిర్ణయించారు. రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయ్యాలో ఉన్న 682 మోటార్ పంపులు మార్పు చేయనున్నారు.

TTD Board serious action against Ramana Deekshitulu, Hikes Contract Employees Salaries

రమణ దీక్షితుల పై వేటు: తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు చేయనున్నారు. రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం. తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణకు నిర్ణయించారు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీరమణ దీక్షితులుపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+