వెంకన్న భక్తుల ఇక్కట్లివి: టీటీడీ టికెట్లలో బోగస్ దందా

తిరుపతి / అమరావతి: గుంటూరు వాసి సత్యమూర్తి తన కుటుంబంతో కలసి ఈ నెల ఐదో తేదీన తిరుమలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. నెలరోజుల ముందే ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కొన్నారు. వారు తిరుమల కొండకు చేరుకున్నాక ఆ టికెట్లు చెల్లుబాటు కాలేదు. దీనిపై టీటీడీ అధికారులు చెప్పిన సమాధానంతో సత్యమూర్తి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

వారు టికెట్లు బుక్‌ చేసింది అధికారిక టీటీడీ వెబ్‌సైట్‌లో కాదు, అదే పోలికలతో ఉండే నకిలీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేశారని టీటీడీ అధికారులు చెప్పారు.

దీంతో ఆ టికెట్లు చెల్లుబాటుకాక ఆ కుటుంబం నానా ఇబ్బందులు పడుతూ శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి చేరింది. ఇది ఒక్క సత్యమూర్తి సమస్య మాత్రమే కాదు. రోజూ వందల మంది భక్తులు నకిలీ వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు.

 నకిలీ వెబ్ సైట్లకు రూ.500 చెల్లింపు

నకిలీ వెబ్ సైట్లకు రూ.500 చెల్లింపు

వాస్తవంగా శ్రీవారి శీఘ్ర ధర్శనం టిక్కెట్ ధర రూ.300 మాత్రమే. కానీ ఈ సంగతి తెలియక నకిలీ వెబ్‌సైట్ల బారినపడుతున్న భక్తుల నుంచి సదరు వెబ్ సైట్ల యాజమాన్యాలు భారీగా నగదు గుంజుతున్నాయి. శ్రీఘ్ర దర్శన టికెట్‌ ధర రూ.300కి తోడు సర్వీసు కాస్ట్‌ పేరుతో రూ.200 అదనంగా కలిపి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున భక్తుల నుంచి వసూలు చేస్తున్నాయి. భక్తులు స్వామి దర్శన టికెట్‌ కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ మొదలుపెట్టగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ కంటే ముందు ఈ నకిలీ వెబ్‌సైట్లు ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిల్లో నగదు చెల్లించిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల మధ్య భక్తులు పేర్కొన్న ఈ మెయిల్‌ ఐడీకి నకిలీ దర్శన టికెట్లు మెయిల్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నా టీటీడీ విజిలెన్స్‌ విభాగం వీటిపై దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 నకిలీలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు

నకిలీలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు

ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్ల కొనుగోలుకు నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవికృష్ణ చెప్పారు. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసిన స్వామివారి దర్శన టికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నారు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ విజిలెన్స్‌ విభాగం చర్యలు తీసుకున్నదని, నకిలీల పట్ల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

 వచ్చే నెల 15 నుంచి యధావిధిగానే సేవలు

వచ్చే నెల 15 నుంచి యధావిధిగానే సేవలు

శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈ నెల 16వ తేదీ నుంచి 2018 జనవరి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాశురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజులు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15 నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు.

 తిరుమల హోటళ్లపై హైకోర్టులో ఇలా పిటిషన్

తిరుమల హోటళ్లపై హైకోర్టులో ఇలా పిటిషన్

తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లు మూసివేయాలని టీటీడీ శనివారం నోటీసులు జారీ చేసింది. అద్దె బకాయిలు, జరిమానా చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. టెండర్‌ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు నిర్ణీత ధరల కంటే అధిక ధరకు విక్రయించటం, దేవస్థానం నిబంధనలు పాటించకపోవడంతో తిరుమలలోని హోటళ్లపై హైకోర్ట్‌లో పిల్‌ దాఖలైంది. దీంతో టీటీడీ అధికారులు తిరుమలలోని ఎనిమిది పెద్ద హోటళ్లు, మరో 13 చిన్న జనతా హోటళ్లకు ఒక్కోనెల అద్దెను జరిమానా విధించి ఆ మొత్తాన్ని వారి ఈఎండీ నుంచీ రికవరీ చేసి నోటీసులు ఇచ్చారు. వ్యవధిలోనే బకాయిలు చెల్లిస్తామని నిర్వాహకులు విజ్ఞప్తి చేసినా టీటీడీ నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+