TTD Chairman:మహిళలతో ఫొటోలు, వీడియోల వైరల్..! బీఆర్ నాయుడు క్లారిటీ..!

ఏపీలో ఓ టీవీ ఛానల్ అధినేతగా, టీడీపీకి సన్నిహితుడిగా ఉంటూ టీటీడీ చైర్మన్ (TTD Chairman) పదవి దక్కించుకున్న బీఆర్ నాయుడు ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తనకు ప్రమేయం ఉన్నా, లేకపోయినా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీఆర్ నాయుడు ఒకరు లేదా పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బీఆర్ నాయుడు తీరుపై విమర్శలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

TTD Chairman B R Naidu Addresses Viral Deep Fake Videos Targeting Him filed complaint

ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది అంటూ ఇవాళ బీఆర్ నాయుడు ఓ ట్వీట్ చేశారు. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమే అన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+