జంతుకొవ్వులున్నాయ్..! సీబీఐ ఛార్జిషీట్ పై టీటీడీ ఛైర్మన్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ చేశారని, జంతువులు, పంది కొవ్వు కలిపారని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయించింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సిట్ తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఇందులో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీంతో వైసీపీ ఈ వ్యవహారంలో అధికార కూటమిని టార్గెట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ (ttd) ఛైర్మన్ బీఆర్ నాయుడు సీబీఐ ఛార్జిషీట్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ ఛార్జిషీట్ లో ఎక్కడా చెప్పలేదని ఆయన వెల్లడించారు. శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడారని ఆయన ఆరోపించారు. కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేసారని పేర్కొన్నారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని బీఆర్ నాయుడు వెల్లడించారు.

గతంలో టీటీడీ ఛైర్మన్ ముఠామేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అంటూ జగన్ ను కూడా ఆయన టార్గెట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆ ఖాతా నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్లాయో సీబీఐ వెల్లడించాలంటూ మరో కొత్త డిమాండ్ కూడా చేశారు. కల్తీ నెయ్యి అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు సీబీఐ బయటపెట్టాలంటూ బీఆర్ నాయుడు కోరారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాకపోతే కల్తీ నెయ్యి దందా ఇప్పటికీ కొనసాగేదన్నారు. మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు సీబీఐ ఛార్జిషీట్ లో లేదని జాతీయ మీడియా సైతం చెప్తున్నా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
-
అలిపిరితో పాటు తిరుమలలో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications