TTD: శ్రీవారి దివ్యదర్శనం విధానంలో మార్పులు, చేతికి కర్ర - ఛైర్మన్ భూమన..!!
Tirumala: కాలి నడకన వచ్చే భక్తుల రక్షణ కోసం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. చిరుతల కారణంగా ఇక ఎటువంటి నష్టం జరగకుండా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం అమలు చేస్తున్న దివ్య దర్శనం విధానంలో మార్పులు చేసారు. కాలినడక మార్గంలో ఫెన్సింగ్ పైన అటవీ శాఖ ఉన్నతస్థాయి నివేదిక ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఛైర్మన్ భూమన ప్రకటించారు.
కాలినడక మార్గంలో ఆంక్షలు: తిరుమల అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5గంటల నుంచి మధ్నాహ్నం2 గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలతో ఉన్న తల్లి తండ్రులను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన ప్రకటించారు. కాలినడకన మార్గంలో భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపైన పలు కీలక శాఖల అధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు.

మధ్నాహ్నం రెండు గంటల తరువాత చిన్న పిల్లలు ఉన్న వారిని అనుమతించేది లేదని భూమన స్పష్టం చేసారు. రాత్రి 10 గంటల వరకు పెద్ద వాళ్లని అనుమతిస్తామని చెప్పారు. అదే సమయంలో కాలినడకన వెళ్లే ప్రతీ ఒక్కరికి మంచి ఊత కర్రను ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీ భక్తుడికి కర్ర: ప్రతీ మనిషికి ఆపద సమయంలో కర్ర తొలి ఆయుధంగా భూమన పేర్కొన్నారు. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో ఉ 6 గంటల నుంచి సా 6 గంటల వరకు వరకు ద్విచక్ర వాహనాలు అనుమతి ఇస్తున్నామని, ఆ తరువాత అనుమతి లేదని వెల్లడించారు. భక్తుల అవసరం మేరకు ఎంది అవసరమైతే అంత మంది అటవీ శాఖ సిబ్బంది నియమించుకోవానికి ఖర్చుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాలి నడకన వెళ్లే భక్తులను గుంపులు, గుంపులుగా పంపాలని..అందునా సెక్యూరిటీ గార్డులను కూడా పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. భక్తులు ఎవరూ కనిపించిన సాధు జంతువులకు ఆహార పదార్ధాలను ఇవ్వటం నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అలా ఇస్తే చర్యలు తీసుకుంటామని భూమన వెల్లడించారు.
దివ్య దర్శనంలో మార్పులు: కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం విధానంలో మార్పులు చేసారు. అలిపిరిలో భూదేవీ కాంప్లెక్స్ లో కాలినడకన వెళ్లే భక్తులకు ఇస్తున్న టోకెన్లను గాలి గోపురం వద్ద పరిశీలన జరుగుతోందని, ఇక నుంచి అలిపిరి వద్దే టోకెన్లు ఇచ్చినా..గాలి గోపురం వద్ద చెకింగ్ ఉండదని భూమన ప్రకటించారు. అలిపిరి వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వారు కాలినడకన లేదా, రోడ్డు మార్గంలో అయినా తిరుమలకు చేరుకొనే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం ప్రకటించారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం యధావిధిగా కొనసాగుతుందని ఛైర్మన్ భూమన ప్రకటించారు. భక్తుల ప్రాణరక్షణే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్లు భూమన స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications