నేను క్రిస్టియన్ అని ఆరోపిస్తున్న వారికి ఇదే నా సమాధానం : భూమన
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు కరుణాకర్ రెడ్డి గురించి చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ఆరోపణలపై ఘాటు సమాధానం ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదని స్పష్టం చేశారు.
టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నియామకం పైన టిడిపి నేతలు కొద్ది రోజులుగా చేస్తున్నారు తాజాగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు క్రిస్టియన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్‌గా నియమించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన భూమన సీరియస్‌గా స్పందించారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్‌గా పని చేశానని గుర్తు చేశారు.

30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని వివరించారు. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని వెల్లడించారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపింది కూడా తానేనని గుర్తు చేశారు. దళిత వాడల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించింది తానేనని.. తాను క్రిస్టియన్ అంటూ, నాస్తికుడు అంటూ ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానంగా భూమన చెప్పుకొచ్చారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయటం ఆపేవాడిని కాదని స్పష్టం చేశారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినని ఇటువంటి వాటికి భయపడనంటూ భూమన తేల్చి చెప్పారు.
దేవుడి దయతో మతాంతికరణలు ఆపటానికి కళ్యాణమస్తు ద్వారా కొత్త కార్యక్రమం తన హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేసి అందరికీ వివరిస్తామని ఈవో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications