గోశాలలో గోవుల మృతిపై భూమన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయి అని వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. నిన్నటికి నిన్న తిరుమల గోశాలలో 100 గోవులు మృతి చెందాయని మాజీ టిటిడి చైర్మన్, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
గోవుల మరణాలపై భూమన సంచలనం
ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా మహా పాతకం చోటుచేసుకుందని పేర్కొన్న ఆయన మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయని తెలిపారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ దాచి పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

వరుస గోమరణాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్
మొత్తం హిందూసమాజం అత్యంత పవిత్రమైనది భావించే గోవులకు టీటీడీ గోశాలలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని, వరుస గోమరణాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోధర్మం కాపాడలేని వారు...గోవిందుని ధర్మం కాపాడగలరా? అంటూ ప్రశ్నించారు. పవిత్ర క్షేత్రంలో గోవులను వథ్యశిలకు బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవుల అనుమానాస్పద మృతిపై పోస్ట్‌మార్టం ఎందుకు చేయించలేదు? చెప్పాలని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి .
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
హిందూధర్మ పరిరక్షణ సంఘాలు ఈ ఘాతుకంపై స్పందించాలని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. ఇక మరోవైపు గో మారణాలపై మరోసారి సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. మూడు నెలల వ్యవధిలో టీటీడీ గోశాలలో గోవులు అనారోగ్యం, సరైన మేత లేకపోవడం వల్ల మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తోన్నట్లు సుబ్రమణ్య స్వామి తెలిపారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానన్న సుబ్రమణ్య స్వామి
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోవుల సంరక్షణ, వాటికి సంబంధించిన విధి విధానాల గురించి తాను తెలుసుకుంటున్నానని, మరింత సమాచారాన్ని సేకరిస్తున్నానని ఆయన వెల్లడించారు. గోవుల మరణం వెనుక నిజనిజాలు ఏమిటనేది వెల్లడి కావడానికి త్వరలోనే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తానని సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూమన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ కౌంటర్
ఇక తాజాగా వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన, టిటిడి పైన ఆయన చేసిన సంచలన ఆరోపణల పైన టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు.గోవుల మరణం పై ఇప్పటికే టీటీడీ నుండి ప్రకటన విడుదల చేసిన ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా భూమన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ లబ్ది కోసమే మచ్చలు వేసే ప్రయత్నం: బీఆర్ నాయుడు
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బిఆర్ నాయుడు రాజకీయ లబ్ధి కోసం మచ్చలు వేసే ప్రయత్నాలను భక్తులు తిరస్కరించాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎస్వీ గోశాలలో గోవుల మరణాలని చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన పేర్కొన్నారు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వి గోశాలలో గోవులు మృత్యువాత పడుతున్నాయని చేస్తున్న ప్రచారం అవాస్తవమని, కల్పిత ఆరోపణలని ఇది అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
టీటీడీ చేస్తున్న కార్యక్రమాల పట్లకంటగింపుతోనే ఆరోపణలు
తిరుమల శ్రీవారి చరణాల సేవలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ట్రస్టు బోర్డు అంకితభావంతో చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటగింపుతో ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమని టిటిడి చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో సమానంగా పూజిస్తూ వస్తున్నామని, గోమాతకు హిందూధర్మం లో ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదని అన్నారు.
ఇది అబద్ధపు ప్రచారం
అటువంటి గోమాత పట్ల టిటిడి ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క గోవు యొక్క మృతిని సామాన్యంగా తీసుకోలేమని, కానీ సహజంగా, వృద్ధాప్యం కారణంగా, అనారోగ్య కారణాలతో మృతి చెందిన గోవుల మృతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం, అబద్ధపు ప్రచారం చేయడం అత్యంత అధర్మమని ఆయన మండిపడ్డారు.
ప్రజలు వదంతులు నమ్మొద్దు
అంతేకాదు ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇతర ప్రాంతాలలో చనిపోయిన గోవుల ఫోటోలను కూడా టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలకు సంబంధించిన ఫోటోలుగా చిత్రీకరించి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ఇది మరింత దారుణమని బిఆర్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలను తెలుసుకోవాలన్నారు.
ఆరోపణలు ప్రజలంతా తిరస్కరించాలని టీటీడీ చైర్మన్ పిలుపు
ఇలాంటి వాటిని నమ్మవద్దని, అవాస్తవాలు పై నమ్మకాన్ని కలిగి మోసపోవద్దని టిటిడి చైర్మన్ విజ్ఞప్తి చేశారు. గో సేవ అంటేనే గోదేవి సేవ అని ఈ పవిత్రమైన సేవను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణమన్నారు. దీనిని ప్రజలంతా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా టిటిడి చేపడుతున్న గోరక్షణ, గో పోషణ కార్యక్రమాలపై భక్తులు యొక్క విశ్వాసం మరింత బలపడాలని టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తన సందేశంలో ఆకాంక్షించారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications