టీటీడీ గోశాలల్లో ఆవులు చనిపోతున్నాయా ? క్లారిటీ ఇదే..!
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలల్లో గత మూడు నెలల్లో 100 ఆవులు చనిపోయినట్లు వైసీపీ ఇవాళ సంచలన ఆరోపణలు చేసింది. గోవుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల, వాటికి తిండి పెట్టకపోవడం వల్ల ఆవులు భారీగా మృత్యువాత పడుతున్నట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీటీడీ గోమాతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీటీడీ స్పందించింది.
గత మూడు నెలల్లో తమ గోశాలల్లో 100 ఆవులు చనిపోయాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు టీటీడీ ఇవాళ ప్రకటించింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పేసింది. కొందరు దురుద్దేశంతో చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో చనిపోయినట్లు చూపిస్తున్న ఆవులు టీటీడీ గోశాలల్లోవి కాదని తెలిపింది. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని భక్తుల్ని కోరింది.

మరోవైపు టీటీడీపై వైయస్ఆర్సిపి తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు, జగన్ మోహన్ రెడ్డి పార్టీ పవిత్ర సంస్థలను కించపరుస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాలపై చేసిన నకిలీ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. టిటిడి గోశాలలలో ఆవుల మరణాలకు సంబంధించి సోషల్ మీడియాలో నిరాధారమైన, దురుద్దేశపూరిత వాదనలను లోకేష్ ఎక్స్ లో ఖండించారు.
I strongly condemn the baseless and malicious propaganda being spread on social media about cow deaths in TTD goshalas. There is no truth to these claims.
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
TTD has clarified the facts. Devotees are urged not to believe this false narrative, which YSRCP has pushed to mislead and… https://t.co/olGNYTi4Rb
ఈ ఆరోపణలలో నిజం లేదని లోకేష్ స్పష్టం చేశారు. టిటిడి ఇప్పటికే వాస్తవాలతో కూడిన ప్రకటన విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ తప్పుడు కథనానికి భక్తులు బలైపోవద్దని కోరుతూ, ప్రజలను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి వైయస్ఆర్సిపి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థలను దోపిడీ చేయడం సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications