వేలు కోసివ్వడం అబద్ధం: కర్ణాటక భక్తుడి మాటలను కొట్టేసిన టిటిడి
తిరుపతి: కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ వచ్చినందుకు తాను వేలు కోసి తిరుమల వెంకటేశ్వర స్వామికి కానుకగా ఇచ్చినట్లు కర్ణాటక భక్తుడు ఒకతను చెప్పిన మాటలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కొట్టిపారేసింది.
తిరుమలకొండ చరిత్రలో అంతటి నికృష్టమైన విరాళం రాలేదని టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి చిన్నంగారి రమణ పిటిఐ వార్తాసంస్థతో చెప్పారు. బెంగళూరు సమీపంలోని రామనగరం నివాసి తన వేలిని కోసి పవిత్రమైన తిరుమలేశుడి హుండీలో వేశాడనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

అటువంటి వార్తల వల్ల, ఉద్దేశాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆయన అన్నారు. ఏడడుగుల హుండీ దగ్గర ఏం జరుగుతుందనే విషయాన్ని పలు నిఘా కెమెరాలు కనిపెడుతూ ఉంటాయని ఆయన చెప్పారు. దాంతో భక్తులు సమర్పించే భారీ నగదును, ఆభరణాలను వేరు చేసి, లెక్కించడానికి రోజుకు మూడుసార్లు హుండీని ఖాళీ చేస్తుంటామని ఆయన చేశారు.
సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ లభించినందుకు డిసెంబర్ 25వ తేదీన తన వేలు కోసి హుండీలో తిరుమలేశుడికి కానుకగా వేసినట్లు సురేష్ అనే కర్ణాటక భక్తుడు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు మంత్రి అంబరీష్ తనను అభినందించినట్లు కూడా అతను చెప్పారు.












Click it and Unblock the Notifications