హత్యాయత్నం కేసులో టీటీడీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్
తిరుపతి: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. మే నెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివారెడ్డి పోలీసులకు ఏ వివరాలు చెప్పలేకపోయారు.
ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శివారెడ్డి నివాసం ఉండే ఆపార్ట్ మెంట్ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లుగా గుర్తించారు. కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే, హత్యాయత్నం చేసిందెవరో సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా లేకపోవడంతో.. పోలీసులు శివారెడ్డితో శత్రుత్వం ఉన్నది ఎవరితో అనేదానిపై ఆరా తీశారు.

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. శివారెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిలో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఆరా తీస్తే.. వారిద్దరూ శివారెడ్డి ఫ్లాట్ ఎదురుగా నివాసం ఉండే శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి అని తేలింది. ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉండటంతో అనేక విషయాలపై ఇరు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు వస్తుండేవి.
ఈ క్రమంలో శివారెడ్డి, శ్రీలక్ష్మి ఈ విషయంలో అనేక సార్లు గొడవ పడ్డారు. రెండు కుటుంబాల వారు సమస్యల విషయంలో వెనక్కి తగ్గకుండా ఈగో సమస్యలకు పోవడంతో అవి మరింత పెరిగుతూ పోయాయి. చివరికి హత్యాయత్నానికి దారి తీసింది.
కాగా, శివారెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన... శ్రీలక్ష్మి దంపతులు అతనిపై సుపారీ గ్యాంగ్‌తో హత్యాయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం శివారెడ్డి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శ్రీలక్ష్మి దంపతులే.. ఈ హత్యాయత్నానికి కారణంగా గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications