ఉపమాక ఆలయంలో రాసలీలలు: టీటీడీ ఉద్యోగిని భార్యే కొట్టి చంపిందా?
తిరుపతి: విశాఖపట్నం జిల్లాలోని ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చిన రాసలీలల వ్యవహారంలో టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తిరుపతిలో ఐఎస్.మహల్ సమీపంలోని నెహ్రూనగర్‌లో నివాసమున్న టిటిడి ఉద్యోగి మనోహరయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు.
బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... స్థానికంగా నివాసముంటున్న మనోహర్ (52) టీటీడీ పరిధిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలలకు ముందు మనోహర్‌ను తిరుపతి నుంచి విశాఖపట్నానికి బదిలీ చేశారు.
ఏప్రిల్ ఒకటో తేదీన ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ రాసలీలల కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డాడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అనంతరం ఆలయంలో జరిగిన రాసలీలలో మనోహర్ ప్రమేయం ఉందని టిటిడి విజిలెన్స్, పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

దీంతో మనోహర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం సెలవుపై తిరుపతికి వచ్చిన మనోహర్ ఉదయాన్నే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతను మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే అతను చనిపోయిన విషయం ఎవరికి తెలియకుండా కుటుంబ సభ్యులు దాచారు.
మంగళవారం రాత్రి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. ఏమి లేదని బుకాయించి.. అర్ధరాత్రి సమయంలో మనోహర్ మృతదేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్ తెప్పించారు. దీంతో ఇరుగుపొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని మనోహరయ్య తలపై ఉన్న గాయాలను గుర్తించి భార్య శారదే ఆయన్ని హతమార్చి ఉంటుందని ఆరోపిస్తున్నారు. కాగా మనోహర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వివాహం అయింది. చిన్న కూతరు శిరీష బీటెక్ చదువుతోంది.
భర్త మృతిచెందితే కారుణ్య మరణం క్రింద కూతురుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇద్దరు కలిసి తలపై కొట్టి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మనోహరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications