వాహనదారులకు టీటీడీ గుడ్ న్యూస్..!!

ఈ ఏడాది రథ సప్తమి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులో జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మష్టి కృషి ఉందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి చర్యలు చేపడతామని చెప్పారు. పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి తిరుమలలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను తీసుకుని రావాలని యోచిస్తున్నామని అన్నారు.

ర‌థ స‌ప్త‌మి వేడుక‌లపై అద‌న‌పు ఈవో సీహెచ్ వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్ లో మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు. రథ సప్తమి సందర్భంగా భక్తుల నుండి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించామని, భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని, అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని అన్నారు.

TTD EO says Free Annaprasadam Distributed to Devotees in Galleries and Receives Widespread Praise

ఈ ఏడాది రథ సప్తమికి రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షించారు. ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు సొజ్జ‌ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లను పంపిణీ చేశారు. 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు అందించారు.

వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరింపజేశారు. 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్ చేశారు. ఇది గత ఏడాది కంటే 73 శాతం అధికం.

తిరుపతి నుండి తిరుమలకు 1932 ట్రిప్పుల ద్వారా 60,425 మంది భక్తులు ప్రయాణించగా, తిరుమల నుండి తిరుపతికి 1942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి చేరారు. గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యం లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దీనికోసం అదనంగా 590 పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లో నియమించారు. 23,000 మంది భక్తులకు వైద్య సేవలు, 94 మందిని అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించినట్లు ఈఓ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+