TTD: సీఎం చంద్రబాబు చేతికి నివేదిక ఇచ్చేసిన టీటీడీ ఈఓ, తరువాత ?
తిరుమల లడ్డుల తయారీ కోసం కల్తీ నెయ్యి కల్తీ పదార్థాలు వాడకం అంశంపై దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీటీడీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. తిరుమల లడ్డుల తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు ఓ నివేదిక తయారుచేసి శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించారు.
తిరుమల లడ్డూల విఫయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అధికారులు చర్చించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని టీటీడీ అధికారులు ఆదివారం పూర్తి నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు సమర్పిస్తారని సమాచారం.

శ్రీవారి ఆలయం సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను టీటీడీ ఈవో శ్యామలరావు శనివారం ఇచ్చిన వేదికలో సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అగమ సలహాదారులు, తిరుమల అర్చకులు, టీటీడీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిద అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.
ఆదివారం మరోసారి విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
తిరుమల లడ్డులు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి టీటీడీ చైర్మన్లు, టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డులు తయారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేయడంతో శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూలు తయారీ కోసం పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉపయోగించారని వెలుగు చూడటంతో కోట్లాదిమంది శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications