తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంలో కీలక పరిణామం..!!
తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయింపు పైన స్వామీజీలు.. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజా గా నిరసన నిర్వహించాయి. ఏడు కొండల పవిత్రత దెబ్బతింటుందని, సనాతన ధర్మానికి ఇది ముప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో టీటీడీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. హోటల్ విషయంలో టీటీడీ నిర్ణయం ఏంటో స్పష్టం చేసింది.
హోటల్ వివాదం
తిరుపతిలో ముంతాజ్ హోటళ్ల నిర్మాణ వివాదం కొద్ది రోజులుగా కొనసాగుతోంది. స్వామీజీలు .. హిందూ సంస్థల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని, హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో స్వామీజీలు దీక్షకు దిగారు. ఒబెరాయ్ హోటళ్లకు కేటాయించిన భూమి రద్దు చేయాలని తిరు క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు టి. ఓంకార్, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద స్వామీజీ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం, టీటీడీ ఈవో, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తుడా వైస్ ఛైర్మన్, ఒబెరాయ్ గ్రూప్ హోటళ్ల ఎండీ, అదే గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్స్, ట్రైడెంట్ ఫైవ్‌స్టార్ హోటల్స్ ఎండీలకు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టులో అఫిడవిట్
ఈ పిల్ లో టీటీడీ ఈవో అఫిడవిట్ దాఖలు చేసారు. తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామం పరిధిలో ఒబెరాయ్ గ్రూప్ సంస్థ హోటళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ టీటీడీ బోర్డు గతేడాది నవంబర్ 18న తీర్మానం చేసినట్లు అఫిడివిట్ లో ఈవో శ్యామలరావు వివరించారు. ఒబెరాయ్ సంస్థ నిర్మించే ముంతాజ్ హోటల్స్, ట్రైడెంట్ 5 స్టార్ హోటళ్లలో విలాసవంతమైన విల్లాలతోపాటు బార్లు, లాంజ్, పార్టీ హాళ్లు, స్పా నిర్మించేందుకు అనుమతించడం తిరుమల కొండ పవిత్రత, ఆధ్యాత్మి కత, హిందూ మత సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

గతంలోనే నిర్ణయం
ఒబెరాయ్ గ్రూప్ కు కేటాయించిన భూమిని రద్దు చేసి తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఆ 20 ఎకరాలను టీటీడీ కి కేటాయించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరుతూ టీటీడీ గత ఏడాది డిసెంబర్లో లేఖ రాసిన విషయాన్ని వెల్లడిం చారు. తిరుమల పవిత్రత ను కాపాడేందుకు ఏడు కొండలను తిరుమల దివ్య క్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007 జూన్‌లో జీవో 746 జారీ చేశారని గుర్తు చేశారు. ఏడు కొండలు, అందు లోని తీర్థాలు, దేవస్థానికి చేరుకునే అన్ని మార్గాలను తిరుమల దివ్వ క్షేత్రం పరిధిలోకి తెచ్చార న్నారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 114 తిరుమల పవిత్ర తను కాపాడేందుకు ఆ ప్రాంతంలో భిక్షాటన, మత్తు పదార్థాల సేవనం, తదితర కార్యక్రమాలను నిషేధించేందుకు అధికారం కల్పి స్తోందని వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత పిల్‌లో తగిన ఉత్తర్వులివ్వాలని అఫిడవిట్ లో కోరారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications