TTD: తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు శుభవార్త: వైభవంగా నేటినుండే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు!!
ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కావటంతో భక్తుల రద్దీ కాస్త తగ్గినట్టు సమాచారం. ఈ క్రమంలో కంపార్ట్మెంట్ లలో వేచి ఉండకుండా భక్తులను నేరుగా క్యూలైన్లలోనికి అనుమతిస్తున్నారు.
ఇక తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుండి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు శ్రీవారి తో పాటు అమ్మవారు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు నేడు మార్చి 20 తేదీన శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో విహరించనున్నారు. పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఆధ్వర్యంలో పుష్కరిణి ప్రాంతంలో విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.
రేపు మార్చి 21వ తేదీన రెండవ రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో స్వామివారు పుష్కరిణిలో మూడు రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఎల్లుండి మార్చి 22వ తేదీన శ్రీ భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
మార్చి 23వ తేదీన శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు సార్లు తెప్పలపై పుష్కరిణిలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక చివరి రోజు మార్చి 24వ తేదీన మలయప్ప స్వామి ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఇక స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ రద్దు చేసింది.
మార్చి 22, 23, 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,051 మంది. వీరిలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,107 మంది. స్వామివారికి నిన్న ఒక్కరోజే వచ్చిన హుండీ ఆదాయం 4.78 కోట్లు.
-
ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications