టీటీడీ కొత్త సౌకర్యం.. శ్రీవారి భక్తులకు శుభవార్తే!
దేశవ్యాప్తంగా ఉన్న 60 టిటిడి ఆలయాలలో భక్తులు సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేయడానికి వీలుగా కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవన కార్యాలయంలో నేడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ఆ ఆలయాల కోసం కీలక నిర్ణయం
వెనుకబడిన ప్రాంతాలలో టీటీడీ నిర్మించ తలచిన 5 వేల ఆలయాలకు అవసరమైన రెండు మూడు డిజైన్లను సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు తద్వారా ఆయా ప్రాంతాలలో ఆలయాన నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందని టిటిడి ఈవో తెలిపారు తిరుమల తరహాలోనే తిరుచానూరు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కూడా టిటిడి అందిస్తున్న సేవల పైన భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.

కదిలే వంతెన మరమ్మత్తు పనులపై కీలక ఆదేశం
తిరుపతిలోని వినాయక నగర్ వద్ద ఉన్న టిటిడి స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మత్తు పనులను వైకుంఠ ఏకాదశి లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆ ఆలయాల అభివృద్ధికి చర్యలు
అప్పలాయగుంట ఆలయం వద్ద భక్తులకు సమాచారం తెలిసేలా సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముంబైలోని బాంద్రా ఆలయంలో జెఈఓ, చీఫ్ ఇంజనీర్ సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ఆలయాలకు నియమించిన ప్రత్యేక అధికారులు, ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిని చర్యలు చేపట్టవలసిందిగా ఆయన ఆదేశించారు.
ఆలయాల స్థల కేటాయింపు, ధార్మిక ప్రచురణలపై నిర్ణయాలు
బీహార్లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి, కర్ణాటకలోని బెలగావి లో ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు పైన సంప్రదింపులు జరపాలని, ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. ధార్మిక ప్రచురణలకు సంబంధించి ఇదివరకే ముద్రించిన పుస్తకాల పంపిణీ విషయంలో తగిన సూచనలు చేసేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి ప్రచురణల్లో బాగా డిమాండ్ ఉన్న పుస్తకాలను మళ్లీ పునర్ముద్రణకు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications