TTD: సిఫార్సు లేఖలపై దర్శనాల్లో మార్పులు - వీఐపీ బ్రేక్ రద్దు..!!

Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. ఇదే సమయంలో ఉగాది ఆస్థానానికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో.. ఏపీ సిఫార్సు లేఖల స్వీకరణలో మార్పులు చేసారు. ఈ వారంలో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను నేడు విడుదల చేయనున్నారు.

25న ప్రత్యేకంగా
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించు కుని మార్చి 25వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా తిరుమలలో ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. దీంతో,
మార్చి 25న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకు లు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.

ttd-has-cancelled-astadala-pada-padmaradhama-and-vip-break-darshan-on-25th-and-30-march

సిఫార్సు లేఖల్లో మార్పులు
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తా రు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతి స్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించటం లేదని టీటీడీ వెల్లడించింది.

బ్రేక్ దర్శనాలు రద్దు
ఇక, ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం ఈ రోజు నుంచి (మార్చి 24) అమ‌లులోకి రానుంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించారు. అదేవిధంగా ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించనున్నట్లు టీటీడీ గ‌తంలోనే స్ప‌ష్టం చేసింది. అదే విధంగా ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌ రించుకుని వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసారు. దీంతో, మార్చి 29న ఎటువంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌టలం లేదని వెల్లడించారు. జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల ఈ రోజు (సోమవారం) ఉదయం పది గంటలకు రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మరి ని వివరాలకు భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని టీటీడీ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+