TTD: ఒబెరాయ్ హోటల్ కు అలిపిరిలో భూములు - టీటీడీ క్లారిటీ..!!
Tirumala: ఒబెరాయ్ హోటల్ గ్రూపుకు అలిపిరిలో భూ కేటాయింపు వివాదం మరో సారి తెర మీదకు వచ్చింది. దీని పైన గతంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హోటల్ కు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పుడు మరోసారి ఈ అంశం పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో.. టీటీడీ ఈ భూ కేటాయింపుల వివాదంలో తొలి నుంచి ఏం జరిగిందీ... చివరగా తీసుకున్న నిర్ణయం పైన స్పష్టత ఇచ్చింది. వస్తున్న ఆరోపణల ను టీటీడీ ఖండించింది.
ఒబెరాయ్ హోటల్ గ్రూపుకు భూముల కేటాయింపుల పైన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీటీ ఖండించింది. గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు గుర్తు చేసింది.

కాగా, ఎప్పుడైతే సదరు భూమిని టూరిజం శాఖ ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు తెలిసిందో అప్పటి నుండి హిందూ సంఘాలు, స్వామీజీలు, భక్తులు, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసారని వివరించింది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 18వ తేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 102 ప్రకారం ఆ పవిత్రమైన భూమి ఒబెరాయ్ హోటల్ కు చెందకుండా టీటీడీకి కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21వ తేదిన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా ఏడు కొండలకు ఆనుకుని ఉన్న పవిత్ర ప్రదేశంలో ఎలాంటి అపవిత్ర కార్యాకలాపాలకు వీలు లేకుండా చేస్తామని చెప్పారని వివరించింది. ఈ క్రమంలో ఉత్తరం వైపు స్వామి పాదాల చెంత ఆనుకుని ఉన్న భూమిని టీటీడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ సదరు భూమికి బదులుగా రోడ్ కు అవతల వైపు భూమి ని కేటాయించాలని టూరిజం శాఖ కోరినట్లు పేర్కొంది. దీనిపై 2025 మే 7వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 250 ప్రకారం భూ బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ టీటీడీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించింది.

ఈ క్రమంలో అలిపిరిలోని స్వామి పాదాల చెంత ఉన్న టూరిజం భూమిని టీటీడీకి , అదేవిధంగా రోడ్డుకు దక్షిణం వైపుగా ఉన్న టీటీడీ భూమిని టూరిజం శాఖకు బదలాయించేందుకు 2025 జూలై 22వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 385 ప్రకారం ఆమోదం తెలిపినట్లు వివరించింది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో రోడ్డుకు ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని భక్తుల సౌకర్యాల కల్పన నిమిత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు వివరించింది.
అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో దక్షిణం వైపు ఇప్పటికే పలు నిర్మాణాలు జరిగాయని పేర్కొంది. ఈ కారణంగా దక్షిణం వైపు ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి, తిరుమల కొండకు ఆనుకుని ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని టీటీడీ తీసుకోవడం జరిగిందని స్పష్టం చేసింది. తిరుమల పవిత్రత, భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి కీలకమైనదిగా స్పష్టం చేసింది.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications