బ్రహ్మోత్సవాల తొలిరోజే అపచారం.. టీటీడీ వివరణ ఇదే..!

శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతున్న సమయంలోనే తిరుమలలో అపచారం జరిగిందనే ప్రచారం జరిగింది. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.బ్రహ్మోత్సవాల తొలిరోజునే ఇలా జరిగిందేంటని భక్తులు చర్చించుకున్నారు. తాజాగా దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ కోరింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయంగా వస్తోందని, అందులో భాగంగానే ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. అంతలోనే దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరమని టీటీడీ తెలిపింది.

TTD has denied the reports of abuse in Tirumala

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ మరొకసారి తెలియజేసింది. ఇక శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఇందులోని నిజా నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ, ఏపీ ప్రభుత్వంతో సహా అయిదుగురుతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరుతో ఈ సంస్థ విచారణ చేసేలా ప్రతిపాదించడం జరిగింది. ఈ వ్యవహారం పైన రాజకీయంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించడం జరిగింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేయనుంది.ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తులకు సంబంధించిదని..రాజకీయాలు సరి కాదని ఉన్నత న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు భావించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+