టీటీడీ గుడ్‌న్యూస్... ఉచితంగా 10వేల దర్శన టికెట్లు
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. అందుకు తగినట్లుగానే కొత్త ఈవోగా శ్యామలరావును నియమించారు. అప్పటి నుంచి తిరుమలలో వైసీపీ హయాంలో పేరుకుపోయి అవినీతిని ప్రక్షాళన చేస్తున్నారు. గతంలో అలిపిరి నడక మార్గంలో వెళ్లేవారికి దర్శన టికెట్లు కేటాయించేవారు. గత ప్రభుత్వం అవి తొలగించింది. దీంతో ప్రస్తుత ఈవో అలిపిరి నడక దారితోపాటు శ్రీవారి మెట్టు మార్గానికి కలిపి 10వేల దర్శన టికెట్లు కేటాయించే యోచనలో ఉంది.
రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటారు
దీనిపై రెండురోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అలిపిరి మార్గంలోవ చ్చేవారికి ఆరువేలు టికెట్లు, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చేవారికి 4వేల టికెట్లు ఇస్తారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో మూడువేల టికెట్లు ఇస్తున్నారు. దీనికి అదనంగా ఈ నాలుగువేల టికెట్లు కేటాయిస్తారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యమని చెబుతున్న తితిదే ఈవో లడ్డూ నాణ్యత బాగోలేదని వస్తున్న వార్తలపై కూడా దృష్టి పెట్టారు. అత్యవసరంగా లడ్డూ నాణ్యతను సమీక్షించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిచేసి భక్తులకు అత్యంత రుచికరమైన లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు.

కర్ణాటక నుంచి రుచికరమైన నెయ్యి
లడ్డూ రుచికరంగా ఉండాలంటే నెయ్యి ఎంతో నాణ్యంగా ఉండాలి. కర్ణాటక కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసిన నెయ్యితో కూడిన లారీ తిరుమలకు బయలుదేరింది. దీనికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ, రంపచోడవరం, పిఠాపురం, హైదరాబాద్ జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, ఒంటిమిట్ట తదితర ఆలయాల్లో లడ్డూలను విక్రయించనున్నారు. తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం ఈనెల 9వ తేదీ నుంచి దక్షిణ మాడ వీదుల్లోని తిరుమల నంబి ఆలయంలో వైభంగా జరగనుంది.












Click it and Unblock the Notifications