పర్వదినం: తిరుమలకు పోటెత్తిన భక్తులు (పిక్చర్స్)
తిరుపతి: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భారీగా తరలివస్తున్న భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు తాగునీరు, ఆహారం అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు, గాలి గోపురం, సిఆర్‌ఓల వద్ద ప్రత్యేక ఆహార పదార్థాల కౌంటర్‌ను చేసినట్లు తెలిపారు. అదే సమయంలో 90 పాయింట్లలో నీటి వసతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విక్యూసి 1, 2, రూ. 300 టికెట్ భక్తుల కోసం నారాయణగిరి వద్ద వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య కేంద్రాలను కూడా పలు చోట్ల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం నారాయణగిరిలో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 3,500 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యిమంది పోలీసులు 1,500 మంది విజిలెన్స్ సిబ్బంది, 600 మంది స్కౌట్స్ భక్తులకు సేవలందించేందుకు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
పర్వదినం: తిరుమలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకున టిటిడి విభాగమైన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. జనవరి 11న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నదనీరాజన ప్లాట్ ఫాం వద్ద ఆధ్యాత్మిక ప్రవచనం, ఆ తర్వాత రాత్రి 11 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
జనవరి 12న ఉదయం 12 గంటలకు విష్ణు సహస్ర నామ పారాయణం, 4 గంటలకు దాస సాహిత్య ప్రాజెక్ట్ కార్యక్రమాలు ఉంటాయని టిటిడి అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులచే వేద పారాయణం, ఆ తర్వాత శ్రీవెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే నాదస్వరం, సంగీత కార్యక్రమాలుంటాయని వారు పేర్కొన్నారు.

కాలినడక భక్తులు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు చేరుకుంటున్న కాలినడక భక్తులు.

క్యూలైన్‌లో భక్తులు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచివున్న భక్తులు.

తాగునీటి పంపిణీ
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు తాగునీరు అందిస్తున్న దృశ్యం.

భక్తులకు ఆహారం
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు తాగునీరుతోపాటు ఆహార పదార్థాలను అందించారు.












Click it and Unblock the Notifications