పెరుగుతున్న బంగారం ధరల వేళ భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్, నేరుగా ఇంటికే..!!

Tirumala: భక్తుల టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం.. వసతిలో కొత్త విధానాలను అమలు చేస్తోంది. భక్తులకు వేగంగా దర్శనం అందించే లక్ష్యంతో క్యూ లైన్లలో వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో శ్రీవారి సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తిరుమల రాలేకపోయిన భక్తులు సైతం ఈ ప్రయోజనం పొందేలా వెసులుబాటు కలిగించింది.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. పెరుగుతున్న బంగారు ధరలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకూ అవకాశం కల్పించేలా టీటీడీ ఒకటి నుంచి 10 గ్రాముల వరకు బరువు కలిగిన బంగారు, వెండి, రాగి డాలర్లను అందు బాటులోకి తీసుకురావాలని దాదాపు నిర్ణయించింది. చాలా కాలంగా శ్రీవారి ఆలయం ముందున్న కౌంటర్‌లో 10, 5, 2 గ్రాముల బంగారు, 50, 10, 5 గ్రాముల్లో వెండి డాలర్లను విక్రయిస్తోంది. సామాన్య భక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని 1 నుంచి 10 గ్రాముల వరకు డాలర్లను అందు బాటు లోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని బోర్డు ఇటీవల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేసే బంగారు, వెండి డాలర్లను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆన్‌లైన్‌ లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ttd-latest-decision-to-provide-1gm-gold-dollar-for-devotees-amid-gold-rates-spike-in-open-market

ఆన్ లైన్ లో ఇంటి వద్దే పొందే అవకాశం

కాగా, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి పోస్టల్ సర్వీస్ ద్వారా వాటిని నేరుగా ఇంటికే పంపేందు కు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల టీటీడీ ఆదాయం పెంచే మార్గాలపై అధ్యయనం కోసం ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శ్రీవారి డాలర్ల విక్రయాలను మరింత పెంచాలని, వాటిని ఆన్‌లైన్‌లో కూడా విక్రయించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు తిరుమలలోని కౌంటర్లలో విక్రయిస్తున్న బంగారు, వెండి డాలర్లు, పెండెంట్లతో పాటు కొత్తగా నాణేలను కూడా ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు. అంతేకాకుండా, ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, వెండి డాలర్లకు బంగారు పూత పూసి తక్కువ ధరకే విక్రయించాలని కమిటీ ప్రతిపాదించింది. డాలర్లను మరింత ఆకర్షణీయమైన డిజైన్లలో తయారు చేయాలని కూడా నిర్ణయించారు. కాగా..ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే డాలర్లు భక్తులకు సురక్షితంగా చేరేలా ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయంతో తిరుమల రాలేని భక్తులు కూడా స్వామివారి డాలర్లను సులభంగా పొందేలా ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+