TTD: వృద్ధుల దర్శనం కోటా పై కీలక ప్రకటన.. ప్రతీ రోజు ఇక ఇలా..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు.. వరుస సెలవులతో కొద్ది రోజులుగా తిరుమల కొండ భక్తులతో రద్దీగా మారింది. గరుడ వాహన సేవ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. ఇక.. తిరుమలలో వృద్ధుల దర్శనం గురించి అనేక రకాలు గా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో, టీటీడీ స్పందించింది. వృద్ధుల దర్శనం పైన స్పష్టత ఇచ్చింది. వృద్ధులకు కీలక విజ్ఞప్తి చేసింది.
వయోవృద్ధుల దర్శనం టీటీడీ మరోసారి స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, వీటిని నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇక.. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని.. వాటిల్లోవాస్తవం లేదని స్పష్టత ఇచ్చింది. తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేకంగా టోకెన్లు మూడు నెలలకు ముందుగానే విడుదల చేస్తారని వెల్లడించింది. ప్రధానంగా రూ.300 ప్రత్యేక దర్శనం తో పాటు వయో వృద్ధుల కోసం మూడు నెలలకు ముందు గానే విడుదల చేస్తారనపి.. ప్రతి నెల ఈ కోట విడుదల అవుతుందని వివరించింది.

ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోందని టీటీడీ పేర్కొంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేసింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.












Click it and Unblock the Notifications