తిరుమల శ్రీవారి భక్తులకు కొత్తగా ప్రసాదం స్కీం

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 88,938 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,548 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్స్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

TTD launched Pusthaka Prasadam scheme

కోట్లాదిమంది తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం టీటీడీ అధికారులు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు టీటీడీ అధికారులు. పుస్తక ప్రసాదం పేరుతో దీన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరి చేతికి పుస్తక ప్రసాదం అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కొద్దిసేపటి కిందటే ఈ పుస్తక ప్రసాదం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సనాతన ధర్మం గొప్పదాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా సమగ్రంగా తెలుసుకునేలా ఈ పుస్తక ప్రసాదం పథకానికి టీటీడీ రూపకల్పన చేసిందని ఆయన అన్నారు.

సనాతనం విలువలను వివరించేలా ఇది ఉండబోతోంది. పుస్తక ప్రసాదం పేరుతో పలు ఆధ్యాత్మిక గ్రంధాలను భక్తులకు అందజేస్తామని చెప్పారు. మతమార్పిడులను సమూలంగా అరికట్టేలా, సనాతన ధర్మం వైభవం, విశిష్టతను అందరికీ తెలియజేసేలా, పుస్తక ప్రసాదం పథకాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.

హిందూ ధర్మంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు పుస్తకప్రసాదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు టీటీడీ పాలకమండలి పేర్కొంది. శ్రీవేంకటేశ సుప్రభాతం, శ్రీశంకరాచార్య కృత స్తోత్రం, రథసప్తమి, భజగోవింద, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, కార్తీక వైభవం వంటి పుస్తకాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+