వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : దర్శనం - వసతి మీ చేతిలోనే..!!

శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శనం, వసతితో పాటుగా అన్ని సౌకర్యాలు అందించనుంది.

|
Google Oneindia TeluguNews

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి దర్శనం..వసతి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. క్షణాల్లో మీ చేతిలోనే పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్ బుకింగ్ అవకాశం మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండ పైన వసతి గదులు.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే, సేవలకు సంబంధించి టికెట్లు మినహా ఇతరత్రా అవకాశాలు లేవు. కానీ, ఇప్పుడు కొత్తగా టీటీడీ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా నిత్యం భక్తులకు కావాల్సిన తాజా సమాచారం అందిస్తుంది. అదే సమయంలో స్వామి వారి చరిత్ర..కైంకర్యాల వివరాలను పొందుపరిచింది.

కొత్త యాప్ లో దర్శనం..వసతి బుకింగ్

కొత్త యాప్ లో దర్శనం..వసతి బుకింగ్


తిరుమలకు వచ్చే భక్తులకు కావాల్సిన పూర్తి సమాచారం ఒకే చోట లభించేలా టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం కొత్తగా యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా భక్తులు తిరుమలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేసుకోవచ్చు.. అలాగే తిరుమలకు సంబంధించి సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చు. ఇప్పటి వరకు ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న సమాచారం ఇక నుంచి భక్తుల చేతుల్లోనే సిద్దంగా ఉండనుంది. దీనికి సంబంధించి జియో సహకారంతో ఈ యప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అన్ని సౌకర్యాలు ఒకే యాప్ లో..

అన్ని సౌకర్యాలు ఒకే యాప్ లో..

టీటీడీ తీసుకొచ్చిన ఈ యాప్ లో దర్శనం వివరాలు..స్వామి వారి కైంకర్యాల వివరాలు పొందుపర్చారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండ పైన వసతి గదులు.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే, సేవలకు సంబంధించి టికెట్లు మినహా ఇతరత్రా అవకాశాలు లేవు. కానీ, ఇప్పుడు యాప్ ద్వారా మరింత ఆధునీకరణతో శ్రీవారి సేవలను వినేందుకు వీలుగా రూపకల్పన చేస్తున్నారు. కొంత కాలం క్రితం టీటీడీ అధికారులు గోవింద యాప్ ను తీసుకొచ్చారు. కానీ, దాని వలన భక్తులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో, ఇప్పుడు నిత్యం భక్తులకు కావాల్సిన సమాచారం తో కొత్త యాప్ తీసుకొచ్చారు. TTDevasthanam యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా అన్ని రకాల సేవలు ఒకే చోట పొందే అవకాశం కలుగుతుంది. శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాప్ లో ఎస్వీబీసీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం కల్పించారు.
బంగారం తాపడం పనులు వాయిదా

బంగారం తాపడం పనులు వాయిదా


ఇదే సమయంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేసారు. శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు రెండు సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదని.. శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పనులు వేగవంతంగా నిర్వహించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్నామన్నారు.ఆరు నెలల కాల పరిమితిలో టెండర్ల ప్రకియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాన్నామన్నారు. రేపు రధసప్తమి వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఏడు వాహనాల్లో స్వామి వారు మాడ వీధుల్లో విహరించనున్నారు. మినీ బ్రహ్మోత్సవాలుగా రధసప్తమి వేడులకను ప్రతీ ఏటా నిర్వహించటం ఆనవాయితీ. ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

English summary
TTD Releases a new AAP for TTD Devotees with Darshanam tickets bookig facility and also for Accomidation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X