TTD: ఇక వారికి నో ఎంట్రీ - దర్శనం, ప్రసాదంలో కీలక మార్పులు..!!
Tirumala: తిరుమలలో సమూల మార్పుల దిశగా కొత్త పాలక వర్గం నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోంది. సామాన్యులకు దర్శనం సులభం గా అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. అదే సమయంలో తిరుమలలో పని చేస్తున్న అన్య మతస్థులను తెలిగించేందుకు రంగం సిద్దమైంది. ఇక, అన్నదాన ప్రసాదంలోనూ మార్పులు చేస్తూ పాలక వర్గం కసరత్తు మొదలు పెట్టింది.
టీటీడీ కసరత్తు
తిరుమలలో నూతన పాలక వర్గం కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. దర్శనం కోసం భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక, తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా ప్రతిపాదనకు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. శ్రీవాణి ట్రస్టు పై విమర్శలు ఉండటంతో..ఆ పేరును మార్చేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని అధికారులకు సూచించింది.

అన్యమతస్తుల తొలిగింపు
తిరుమలలో నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అదే విధంగా తిరుమలలో పని చేస్తున్న అన్యమతస్తుల తొలిగింపు పైన కసరత్తు ప్రారంభించింది. వారితో చర్చలు చేసి రెండు ప్రతిపాదనలు వారి ముందు ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అన్యమతస్తులైన ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖలకు కేటాయిస్తామని.. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పిస్తామనే ప్రతిపాదనలు వారి ముందు ఉంచనుంది. టీటీడీ, ఎస్వీబీసీలో దాదాపు 45 మంది అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు.
దర్శన - సేవా టికెట్లు
హిందువులు కాని ఉద్యోగులను తిరిగి గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పని ప్రారంభించింది. అయితే, ఇప్పటికే వీరి విషయంలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీంతో, టీటీడీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. తిరుమల శ్రీవారి ఫిబ్రవరి నెల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications