TTD: దివ్య దర్శనం టోకెన్లు రద్దు, ఆ టికెట్ల కోటా పెంపు - మార్గంలో 25 చిరుతలు..!?

Tirumala: తిరుమలకు వచ్చే నడక దారి భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఛైర్మన్ కరుణాకరరెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తాజాగా బాలికను హత మార్చిన ప్రదేశం లోనే చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో, నడకదారి భక్తుల సంఖ్య తగ్గేందుకు దివ్య దర్వనం టోకెన్ల జారీ నిలుపుదల దిశగా అడుగులు పడుతున్నాయి.

టీటీడీ అప్రమత్తం:
తిరుమల నడక మార్గంలో తాజాగా చిన్నారిని చిరుత బలి తీసుకోవటంతో టీటీడీ అప్రమత్తమైంది. వెంటనే చిరుతలను బంధించటానికి బోన్లు ఏర్పాటు చేసారు. అందులో ఈ తెల్లవారు జామున ఒక చిరుత చిక్కుకుంది. బాలిక పై దాడి చేసిన చిరుత.. పట్టుబడ్డ చిరుత ఒక్కటేనా అన్నదానిపై పరీక్షలు జరిపి నిర్ధారిస్తామని అధికారులు వెల్లడించారు.

TTD

శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయన్నారు. కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యాయనం చేస్తామన్నారు. నడక మార్గానికి సమీపంలోని కిలో మీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్ని చిరుతలు సంచారిస్తున్నాయో గుర్తిస్తామన్నారు. 7వ మైల్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే మానిటరింగ్ సెల్‌ని ఏర్పాటు చేస్తున్నామని డీఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు.

దివ్య దర్శనం రద్దు దిశగా:

ఇదే సమయంలో యాత్రికుల భద్రతా చర్యల్లో భాగంగా నడకదారిన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనం టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేయాలని టీటీడీ యోచిస్తోంది. దీని కారణంగా మొక్కులు ఉన్న వారు మాత్రమే నడక దారి మార్గంలో తిరుమలకు రావటం ద్వారా..నడక మార్గంలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తోంది.

ఇదే సమయంలో వీరికి కూడా ప్రస్తుతం 15 వేల వరకు అందుబాటులో ఉంచుతున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 30 వేల వరకు పెంచాలని ప్రతిపాదించింది. నడక మార్గంలో భక్తుల భద్రతైన ఈ రోజు ఛైర్మన్ భూమన కీలక సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సమయంలో దివ్య దర్శనం టికెట్ల రద్దు పైన అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

నడక మార్గంలో తాజా ఆంక్షలు:
ఇక, నడకదారుల్లో పిల్లల అనుమతిపై పలు ఆంక్షలు విధించింది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రెండు ఘాట్‌ రోడ్లలో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది.

ఏడవ మైలు వద్ద నుంచి చిన్న పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ట్యాగులపై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌, పోలీసు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సిబ్బంది జతపరుస్తున్నారు. ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుత పులుల సంచారం కనిపించిటంతో టీటీడీ చర్యలు ప్రారంభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+