తిరుమల భక్తులకు కీలక సూచన - ఆ సర్టిపికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి..!?

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం.. వైకుంఠ ఏకాదశి కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. జనవరి 2వ తేదీ నుంచి పది రోజులు పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. దీని కోసం ఈ ఉదయం విడుదల చేసిన ఆన్ లైన్ టికెట్లు 45 నిమిషాల్లో అయిపోయాయి. దీంతో, వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల డిమాండ్ భారీగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం తిరుమలకు రోజు 60 నుంచి 80 వేల మంది వరకు శ్రీవారిని దర్శంచుకుంటున్నారు. జనవరి 1వ తేదీ నుంచి సంక్రాంతి వరకు రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని, మాస్కు తప్పని సరిగా రద్దీ ప్రాంతాల్లో వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ముందస్తు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా శ్రీవారి ప్రత్యేక దర్శనం కు వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ పూర్తయిన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకొని రావాలని టీటీడీ స్పష్టం చేసింది. టీకాలు వేసుకొని వారు కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తో రావాలని స్పష్టం చేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే తిరుమల కొండ పైన ఎవరికీ అసౌకర్యం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

TTD made covid Vaccination Certifacte mandatory for Devotees while reach Tirumala for special Darshan

జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. పది రోజుల పాటు సర్వదర్శనం టికెట్లు తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల ద్వారా ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం కరోనా ఛాయలు లేవు. విదేశాల నుంచి వారితో మాత్రం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. దీని కారణంగా కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని టీటీడీ సూచిస్తోంది. జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచనుండటంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+