కేశాలకు రూ. 74 కోట్లు: బ్రహ్మోత్సవాల టిటిడి ఏర్పాట్లు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి మానవ కేశాలను వేలం వేసింది. ఈ వేలం ద్వారా వాటిని విక్రయించింది. వాటికి 74 కోట్ల రూపాయల విలువ పలికింది. తిరుమల జాయింట్ ఈవో కెఎస్ శ్రీనివాస రాజు పర్యవేక్షణలో గురువార ఈ వేలం జరిగింది. జూన్‌లో మానవ కేశాలు 130 కోట్ల రూపాయలు పలికాయి. కేశాల ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే కావడం విశేషం.
ఇదిలావుంటే, టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంజి గోపాల్ గురువారం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతో పాటు తిరుమల జెఇవో కెఎస్ శ్రీనివాస రాజు కూడా ఉన్నారు. తనిఖీల్లో భాగంగా టిటిడి ఈవో కొత్త స్వర్ణ రథ మండపాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. వైభవోత్సవంలో వివిధ వాహనాలను ప్రదర్శించారు.

ఈవో నారాయణగిరి శిఖరాన్ని కూడా సందర్శించారు. అక్కడ శ్రీవారి పాదాలను నెలకొల్పుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 70 కోట్ల రూపాయలతో తలపెట్టిన వరాహస్వామి అతిథి గృహానికి ఎదురుగా శ్రీవారి సేవా భవన సముదాయనికి శంకుస్థాపన చేస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నందున ఏర్పాట్లలో వేగం పెరిగిందని ఇవో మీడియా ప్రతినిధులతో చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథోత్సవం సందర్భంగా స్వర్ణ రథాన్ని వాడుతామని, అయితే దానికి ముందు సెప్టెంబర్ 30వ తేదీన వ్రయోగాత్మకంగా నడిపి చూస్తామని ఆయన చెప్పారు. ఎస్ఇ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్‌వో శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు కూడా వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications