Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల వెళ్లే భక్తుల కోసం..: టీటీడీ సూచనలు, అత్యవసర చర్యలు

Heavy rain in Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా వచ్చే అయిదు రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి, ఇతర విభాగాల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా సీజనల్ వారీగా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొటొకాల్ ను తీసుకురావాలని ఆదేశించారు.

TTD Officials Gear Up for Heavy Rains Enhanced Safety Measures for Devotees

టీటీడీ డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయాలని సూచించారు. చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందులో భాగంగా పురాతన గోపురాలు, కట్టడాల ధృడత్వం, సంరక్షణ చర్యల్లో భాగంగా ఒక సంస్థాగత విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించడానికి ప్రత్యేకంగా ఓ టైమ్ టేబుల్ ను రూపొందించాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో క్యూలైన్లు బయటి వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తుల రద్దీని నియంత్రించడానికి వీలుగా సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గించాలని చెప్పారు. దీనివల్ల సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోడానికి వీలుకలుగుతుందని తెలిపారు.

భారీ వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగిపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీల ద్వారా తొలగించాలని టీటీడీ అటవీ, రవాణ విభాగం అధికారులకు ఆయన సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించడానికి కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్, ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశించిన ఆన్ లైన్ సేవలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

ఓ ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోన్ నెంబర్ ను కేటాయించి, దానిని టీటీడీ సిబ్బంది, భక్తులకు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని వెంకయ్య చౌదరి అన్నారు. విపత్తు సమయాల్లో వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. దిగువ ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి, మాల్వాడిగుండం వద్ద జలపాతాల వద్ద భక్తులు గుమికూడి సెల్ఫీలు తీసుకోకుండా భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు.

ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరాయంగా రెండు ఘాట్ రోడ్లలో నడిపి అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరవేసేలా ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి చెప్పారు. వర్షాకాలంలో భక్తులు జారీ పడకుండా ఆలయం, మాడ వీధుల్లో కాయర్ మ్యాట్లను పరచాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించడం, ఆలయం, పరిసరాల్లో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని అన్నారు.

శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్, మాడ వీధుల్లో రంగ వల్లులు, కూల్ పెయింట్ వేసిన ప్రాంతాల్లో జారి పడే ప్రమాదం ఉన్నందున, వాటిని గరుకుగా చేసి భక్తులు జారకుండా ఉండేదుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వర్షం పడే సమయం చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తులు చెట్లు కింద ఉండకూడదని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+