TTD: భక్తులకు ఇక మరింత వేగంగా దర్శనం, టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. పరీక్షల సమయం సమీపిస్తుండటంతో రద్దీ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు పెంచే విధంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యేక పర్వదినాల వేళ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ రద్దీ మేనేజ్ మెంట్ చేస్తోంది. ఇందు కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని పర్యవేక్షిస్తూ నిర్ణయాలు అమలు చేస్తోంది. దీంతో పాటుగా టీటీడీ భక్తులకు వేగంగా దర్శనం అందేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వేగంగా శ్రీవారి దర్శనం అందే విధంగా కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించే విధంగా కార్యాచరణ సిద్దం చేసింది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులకు వేగంగా దర్శనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగించి రెండు గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీఫీషియల్ కెమేరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నిర్ణయాల అమలు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూ లైన్లు.. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తుల రద్దీని గమనిస్తూ... నియంత్రణ తో పాటుగా వేగంగా క్లియర్ చేసే విధంగా సిబ్బందికి సూచనలు ఇవ్వనున్నారు.

వేగంగా దర్శనం
తాజాగా వైకంఠ ఏకాదశి నాడు ప్రారంభించి పది రోజుల పాటు నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనం సమయంలోనే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ.. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం అమలు చేసారు. ఆలయ పరిసర ప్రాంతాలు, మాడ వీధుల్లో ఈ ఏఐ ఆధారిత కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భక్తుల కదలికలను తెలుసుకోనున్నారు. ఈ సీసీ కెమెరాలను వైకుంఠం క్యాకాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో డ్యూటీలో ఉన్న అధికారులు నిరంతరం భక్తుల రద్దీ ఎలా ఉందనే విషయాలను గమనిస్తూ.. వేగంగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఇటీవల రధసప్తమి సందర్భంగా కూడా మాధవీధుల్లో ఈ ఏఐ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవడం వల్ల భక్తులు గంటల పాటు దర్శనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో కూడా ఆ సేవలు! -
దివ్వెల మాధురిపై బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫైర్.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం!












Click it and Unblock the Notifications