తిరుమల CRO పై టీటీడీ తాజా నిర్ణయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 71,721 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,011 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఆధునికీకరణపై టీటీడీ దృష్టి సారించింది. ఈ రెండింటినీ భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అలాగే- సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కార్యకలాపాలను మెరుగుపర్చాలని సంకల్పించింది.
ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఆధునికీకరణపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం ఏర్పాటైంది. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణుడు రాముడు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలను పర్యావరణం, ఆధ్యాత్మికపరంగా అభివృద్ధి రూప కల్పన చేయాలని సూచించారు.
ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఆధునీకరణపైనా ఈవో.. టీటీడీ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేలా సీఆర్ఓ ఉండాలని, ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
సీఆర్వో చుట్టు పక్కల గల అన్ని ఖాళీ ప్రాంతాలను కూడా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భక్తుల రద్దీ అధికంగా సమయంలో ఎటువంటి తోపులాట చోటు చేసుకోకుండా సీఆర్ఓ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని, భక్తులకు అందజేసే సౌకర్యాల్లో జాప్యం ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications