TTD: భక్తులకు అలర్ట్ - ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. చిరుతలను బంధించటంతో ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసకున్నారు. తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధత పై టీడీడీ సమీక్షలు ప్రారంభించింది. దసరా కావటంతో క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆంక్షల సడలింపు: తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఆరు చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు: ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహణలో భాగంగా ఇప్పటికే ఒక విడతను వైభవంగా నిర్వహించారు. ఇక, రెండో బ్రహ్మోత్సవాలకు టీటీడీ సమాయకత్తం అవుతోంది. అక్టోబరు 14న అంకురార్పణ, అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు.
దసరా సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అధికారులు సమన్వయంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో విజయవంతం చేయాలని కోరారు. తిరుమలలో శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు: తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications