TTD: శ్రీవారి భక్తులకు అరుదైన సందర్భం - టీటీడీ కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడాది చివర కావటంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కొత్త సంవత్సరం తొలి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వ దినాలను టీటీడీ వెల్లడించింది. జనవరిలో లక్షలాది మంది భక్తులు పాల్గనే వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో భక్తులకు కీలక సూచనలు చేసింది.
టీటీడీ కసరత్తు
టీటీడీ జనవరి నెలకు సంబంధించి విశేష పర్వదినాలను ప్రకటించింది. జనవరి 09: చిన్న శాత్తు మెర నిర్వహించనున్నారు. జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. పది రోజుల పాటు 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక, జనవరి వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం నిర్వహించనున్నరు. సంక్రాంతి వేళ.. జనవరి 15న ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ముఖ్యమైన పర్విదినాలు
ఇక, జనవరి 17న తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహిస్తారు. జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం జరగనుంది. జనవరి 19న పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపుకు నిర్ణయించారు. జనవరి 20న శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. జనవరి 23న అధ్యయనోత్స వాలు సమాప్తం కానున్నాయి. జనవరి 24న తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు .. జనవరి 25న సర్వ ఏకాశశి.. జనవరి 27: మాస శివరాత్రి, జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
భక్తుల కోసం
ఇక, జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. టీటీడీ ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన టోకెన్లు స్వల్ప సమయంలోనూ పూర్తయ్యాయి. ఇక, ఆఫ్ లైన్ లో టికెట్లు జారీ చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసారు. ఆ పది రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. టికెట్ ఉన్న వారినే దర్శనానికి అనుమతిస్తామని ఈవో ఇప్పటికే ప్రకటించారు. దీంతో..కొత్త సంవత్సరం ప్రారంభం, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి సెలవుల వేళ భక్తుల రద్దీతో పాటుగా తిరుమలలో నిర్వహించే కార్యక్రమాలతో శ్రీవారి ఆలయం వద్ద భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి దక్కనుంది.












Click it and Unblock the Notifications