దిగొచ్చిన టీడీపీ: టీటీడీ పదవి నాకొద్దు.. బాబుకు అనిత లేఖ, ఆమే లేఖ రాయడం వెనుక

విశాఖపట్నం/అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలక వర్గం సభ్యురాలిగా తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

తాను క్రైస్తవురాలిని అని, తన హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రభుత్వం టీటీడీలో క్రైస్తవులకు చోటు కల్పిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీడీపీ మెట్టు దిగింది. ఈ మేరకు అనిత లేఖ రాశారు.

TTD row: TDP MLA Vangalapudi Anitha letter to Chandrababu Naidu

తన నియామకాన్ని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారని, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో తనన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టిటిడి పాలకవర్గంలో తనకు అవకాశం కల్పించినందకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని అయినప్పటికీ, కొందరు తనను నిరూపించుకోవాలనేట్లుగా రాజకీయం చేస్తున్నారన్నారు.

కాగా, ఎమ్మెల్యే అనిత గతంలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు శనివారం ఉదయం నుంచే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తన బ్యాగులో, కారులో ఎప్పుడూ బైబిల్‌ ఉంటుందన్నారు. ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే అనిత ఖండిస్తూ... తాను హిందువునేనని నిరూపించేలా గతంలో దేవాలయాలు సందర్శించిన, వ్రతాలు, పూజలు చేసిన ఫొటోలు విడుదల చేశారు. అదంతా టీటీడీలో పదవి కాపాడుకునేందుకు ఆమె పెట్టిన ఫోటోలుగా చాలామంది అభిప్రాయపడ్డారు. ఆమెపై, టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

అందుకే వనిత ఉపసంహరణ లేఖ

టీడీపీ చైర్మన్‌ను, పాలకమండలిని నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని వెనక్కి తీసుకుంటే బాగుండదు కాబట్టి వనితనే తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+