టీటీడీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్, ఫుడ్.. అప్లై చేసుకోండి!

తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధ్వర్యంలో నడుపుతున్న వివిధ విద్యా సంస్థల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వేదపాఠశాలలు, శిల్ప కళాశాల వంటి 33విద్యా సంస్థల్లో మొత్తం 24,750మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. టీటీడీ ఈ సంస్థల్లో ఉచిత విద్య, హాస్టల్ వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలను అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు తక్షణం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది.

టీటీడీ జూనియర్ కాలేజీలలో సీట్లు

టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో ఎస్వీ జూనియర్ కాలేజీలో 792సీట్లు, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో 968సీట్లు, ఎస్వీ ఓరియంటల్ కాలేజీ (సంస్కృతం)లో 180సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ వంటి గ్రూపుల్లో చదవాలనుకునే విద్యార్థులు మార్కుల ఆధారంగా అడ్మిషన్ పొందవచ్చు. ఈ కాలేజీలకు మే 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ttd said good news over ttd schools and colleges admissions free education hostel and food too

డిగ్రీ కాలేజీల్లోనూ అడ్మిషన్ లకు దరఖాస్తుల ఆహ్వానం

జూన్ 1 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశాల ప్రక్రియ జరుగనుంది. మరిన్ని వివరాలకు admissions.tirumala.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి. డిగ్రీ కాలేజీల్లో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ (బాయ్స్), ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కాలేజీ (బాయ్స్), ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజీ (గర్ల్స్), ఎస్వీ ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, హోమ్ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో వసతి సౌకర్యం కూడా ఉంది.

ఆలయ నిర్మాణం, శిల్పం వంటి కోర్సులలోనూ డిప్లమా

డిగ్రీ అడ్మిషన్ల ప్రకటన త్వరలో విడుదల కానుంది. వివరాలకు tirumala.org వెబ్‌సైట్ లేదా 86869 39314, 95051 23979 నంబర్లను సంప్రదించవచ్చు. శ్రీవేంకటేశ్వర శిల్ప కళాశాలలో 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్మాణం, శిల్పం, లోహం, కొయ్య, చిత్రలేఖనం, కలంకారి వంటి నాలుగేళ్ల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఉచిత హాస్టల్, భోజనం, దక్షిణాది ఆలయాల పర్యటనలు, కోర్సు పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల FD సౌకర్యం కూడా ఉంది.

వేద పాఠశాలల్లో అడ్మిషన్ లు

జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులలో చేరాలి అనుకుంటే 08772-264637.ను సంప్రదించవచ్చు. వేద పాఠశాలల్లో తిరుమల, కోటప్పకొండ, భీమవరం, విజయనగరం, నల్గొండ, కీసరగుట్టల్లో 450 సీట్లు ఉన్నాయి. 12 ఏళ్ల రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు 7 ఏళ్ల కృష్ణ యజుర్వేదం, అథర్వణ వేదం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 12-14 ఏళ్ల ఉపనయనం చేసిన బాలురు అర్హులు. మే 31 వరకు దరఖాస్తులు సాధ్యం.

కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కు తెలంగాణా బీజేపీ చీఫ్ మద్దతు
కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కు తెలంగాణా బీజేపీ చీఫ్ మద్దతు

వారికి టీటీడీ సేవలు

అనాథ పిల్లల కోసం బాల మందిరాలు, చెవిటి-మూగ విద్యార్థుల కోసం ప్రత్యేక సంస్థలు, వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం శ్రవణం కార్యక్రమం వంటి సేవలు కూడా టీటీడీ అందిస్తోంది. ఇక్కడ కూడా ఉచిత విద్య, వసతి, భోజనం లభిస్తాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు త్వరగా దరఖాస్తు చేసుకొని ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+