ఏపీ గణతంత్రం: మొదటి బహుమతి దేవుడిదే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థాన శకటంతో ప్రారంభమైన ప్రదర్శన విశేషంగా జరిగింది.

వ్యవసాయ, నీటిపారుద, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పౌరసరఫరాలు, జాతీయ ఆహార భద్రత సహా పలు శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శన అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి బహుమతి అందుకుంది.

TTD Sakatam got first prize in Ap R-Day Parade in Vijayawada

అలాగే వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, సాగునీటి శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి. ఆయా శాఖలకు సంబంధించిన కమిషనర్లు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 66వ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. తొలుత జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+