తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు, డేట్, టైమ్ ఇదే, పక్కా సమాచారం !
తిరుమల/తిరుపతి: తిరుమలలోని కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. తిరుమల బ్రహోత్సవాల సందర్బంగా ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటారని, వాహనాల్లో, కాలినడక భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17వ తేదీన బ్రహోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయని శనివారం టీటీడీ అధికారులు పూర్తి సమాచారం ఇచ్చారు.తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు అదిరిపోయే రీతిలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
* 17వ తేదీ ఆదివారం బ్రహోత్సవాలకు అంకురార్పణ. రాత్రి 7 నుండి 8 గంటల వరకు జరుగుతుంది.
*18వ తేదీ సోమవారం బంగారు తిరుచ్చి ఉత్సవం, మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.
ధ్వజారోహణం(మీన లగ్నం), సాయంత్రం 6.15 గంటల నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం, రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతుంది.
*19వ తేదీ మంగళవారం చిన్నశేష వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం - మధ్యాహ్నం 1గంట నుండి 3 గంటల వరకు.
హంస వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.
*20వ తేదీ బుధవారం సింహ వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు.
ముత్యపుపందిరి వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.
* 21వ తేదీ గురువారం కల్పవృక్ష వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
* 22వ తేదీ శుక్రవారం మోహినీ అవతారం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు..
* 23వ తేదీ శనివారం హనుమంత వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్వర్ణరథం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు.
గజ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.

* 24వ తేదీ ఆదివారం సూర్యప్రభ వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు.
చంద్రప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.
* 25వ తేదీ సోమవారం రథోత్సవం, ఉదయం 6.55 గంటలకు.
అశ్వ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు.
* 26వ తేదీ మంగళవారం పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు.ధ్వజావరోహణం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తామని శనివారం టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల సందర్బంగా ఇప్పటి నుంచి తిరుమలలో అన్ని ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి.












Click it and Unblock the Notifications