TTD: అవన్నీ అభూత కల్పనలే - తేల్చి చెప్పిన టీటీడీ..!!
Tirumala: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ పై చేసిన ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలేనని స్పష్టం చేసింది. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లుతున్నారని పేర్కొంది. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవమని వివరించింది.
సమయాన్ని పెంచాం
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని వెల్లడించింది. అదే విధంగా శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక - మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని వివరించింది. అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరమని స్పష్టం చేసింది.

లోటు పాట్లు లేవు
అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవని పేర్కొంది. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురా వడం జరిగిందని వివరించింది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదా లు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశామని వెల్లడించింది. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగిందని చెప్పుకొచ్చొంది. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని టీటీడీ గుర్తు చేసింది.
ఏఐ టెక్నాలజీతో
ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించింది. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు అందిస్తున్నామని వెల్లడించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నామ ని వివరించింది. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications