చరిత్ర సృష్టించిన టీటీడీ

తొమ్మిది రోజుల పాటు జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.

చివరిరోజైన పంచమతీర్థం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్కరోజులోనే లక్షన్నరమందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలను అందించింది. 1.50 లక్షల‌ మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం అందించినట్లు టీటీడీ వెల్లడించింది. అన్నప్రసాదాల వితరణ కోసం తిరుచానూర్ లో మొత్తం 160 కౌంటర్లు ఏర్పాటయ్యాయి. తోళ్లప్ప గార్డెన్స్‌- 50, జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్- 40, అయ్య‌ప్ప‌స్వామివారి ఆల‌యం- 50, పూడి- 20 వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

TTD Serves 1 50 Lakh Devotees Annaprasadam During Tiruchanoor Brahmotsavam Celebrations

ఆయా కౌంట‌ర్లలో 24వ తేదీ రాత్రి నుండి 2 5వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగింది. కదంబం, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర‌, ఉదయం ఉప్మా, పొంగలిని విరివిగా అందజేశారు. పంచమి తీర్థం కోసం శ్రీ పద్మావతీ అన్నప్రసాద కేంద్రం, శ్రీనివాసం కాంప్లెక్స్, టిటిడి పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటిన్ ల నుండి 13 బాయిలర్స్ ద్వారా వంటలను తయారు చేశారు. హోల్డింగ్ పాయింట్లు, గ్యాలరీలు, క్యూలైన్లు, భక్తులు అధికంగా ఉండే కూడళ్ల వద్ద పంపిణీ చేశారు.

1.25 లక్షల మందికి బాదంపాలు

పంచమి తీర్థం సందర్భంగా అన్నప్రసాదాలతో పాటు 1.25 లక్షల మందికి బాదంపాలు, లక్ష మందికి బిస్కెట్ ప్యాకెట్లు, 30,000 మందికి మజ్జిగ, సుండలను అందించారు. భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలను అందించేందుకు 900 మంది శ్రీవారి సేవకులు, 100 ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, 200 మంది అన్నప్రసాదం సిబ్బంది, 500 మంది ఎఫ్ఎంఎస్ సిబ్బంది సేవలు అందించారు.

దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్ల పంపిణీ

పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+