జమ్ము టీటీడీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ - వార్షిక బ్రహ్మోత్సవాలు..!!

దేశంలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల్లో భక్తుల సేవలను మెరుగుపర్చాలని టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే విశాఖలో టీటీడీ ఆలయంలో టీటీడీ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసారు. ఇప్పుడు ఢిల్లీలోని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా జమ్మూలో టీటీడీ ఆలయం నిర్మాణం జూన్ నాటికి పూర్తి కానున్నట్లు ప్రకటించారు. జూన్ 3 -6 మధ్యలో ప్రారంభోత్సవం ఉండే అవకాశం ఉంది. 8న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.

జమ్ములో శ్రీవారి ఆలయం : ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ములో 2021 జూన్ లో 33.22 కోట్ల అంచనా వ్యయంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిర్ణయించారు. 18 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆలయం కోసం 62.10 ఎకరాల భూమి కేటాయించింది. ఇప్పుడు ఆలయం పూర్తి కావచ్చింది.

ttdtemple-

జూన్ నాటికి ఆలయం పూర్తిగా సిద్దం అవుతుందని టీటీడీ స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి 6 మధ్యలో ప్రారంభోత్సవం ఉంటుందని టీటీడీ పాలక వర్గం వెల్లడించింది. జమ్ము టీటీడీ ఆలయంలో జూన్ 3న కుంభాభిషేకంతో మొదలై 8న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. జమ్ము సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం సిద్దం అవుతోంది.

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు : దేశరాజధాని ఢిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మే 8న స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆలయంలో లడ్డు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భవన్‌లలో సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ttd-tirumala

ఢిల్లీలో టీటీడీ సమాచారం కేంద్రం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు కూడా ఉన్నాయని వెల్లడించారు. శ్రీవారి చక్రస్నానం యమున ఘాట్‌లో జరుగుతుందని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. యాగశాల నిర్మాణం పూర్తయిందని.. మే 8న ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలకే పరిమితం చేయమని సూచించారన్నారు. ఇతర ఆలయాల కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో టీటీడీ సమాచార కేంద్రాన్ని కొవిడ్ కారణంగా తీసివేశామని.. టీటీడీ చైర్మన్, ఈఓతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+