తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవుల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. ఈ నెల 28న తిరుమల లో రెండో సారి ఒకటే నెలలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. అదే విధంగా వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో టీటీడీ తిరుమలలో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ పదార్ధాల పైన బ్యాన్ విధించింది.
టీటీడీ తిరుమలలో కొత్త రూల్ అమల్లోకి తీసుకొచ్చింది. భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. భక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో చైనీస్ వంటకాలను నిషేధించారు. టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ తిరుమలలోని రెస్టా రెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఇటీవల కాలీఫ్లవర్‌లో పురుగులు రావడాన్ని గుర్తించామని, భక్తుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా గోబీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కాలీఫ్లవర్‌ను ఆహార తయారీలో ఉపయోగించకూడదని టీటీడీ సూచించింది, ఇప్పటికే తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో చైనీస్ వంటకాలు కూడా నిషేధంలో ఉన్నాయి.

టీటీడీ కీలక నిర్ణయాలు
ఇక, తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహిం చనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శనివారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా.. ఈ సారి తిరుమలలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనుంది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనుండగా పలు ప్రారంభోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. తిరుపతిలో రెండు వసతి సముదాయాల బ్రహ్మోత్సవాల వేళ నుంచి అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications